ప‌వ‌న్ కు తిల‌కం దిద్దిన భార్య … నెట్ లో వైర‌ల్ అవుతున్న వీడియో

Anna Lezhneva gave him Harathi for the auspicious beginning of pawan political tour

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌వ‌న్ చెలోరే చెలోరె చెల్ యాత్ర‌కు బ‌య‌లుదేరిన వేళ జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సాధార‌ణంగా భ‌ర్త‌లు ఇలా ప్ర‌జాయాత్ర‌ల‌కు, ఇత‌ర ముఖ్య‌మైన ఘ‌ట‌న‌ల‌కు బ‌య‌లుదేరి వెళ్తున్న స‌మ‌యంలో భార్య‌లు హార‌తి ఇచ్చి సాగ‌నంప‌డం భార‌తీయ సంప్ర‌దాయం. అదే త‌ర‌హాలో రాజ‌కీయ వేత్త‌గా తొలిసారి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తున్న ప‌వ‌న్ కు ఆయ‌న భార్య అన్నా లెజినోవా కూడా నుదుట తిల‌కం దిద్ది హార‌తి ఇచ్చేందుకు వ‌చ్చారు.

సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా చీర క‌ట్టుకుని ప‌వ‌న్ వెన‌క న‌డిచివ‌చ్చారు. అనంత‌రం ఆయ‌న‌కు హార‌తి ఇచ్చేందుకు పూలు, కుంకుమ‌, హార‌తి ఉన్న ప‌ళ్లెం చేతిలోకి తీసుకున్నారు. భ‌ర్త నుదుటిన తిల‌కం దిద్దేందుకు సిద్ధ‌మ‌యింది. అయితే ఆమె భార‌తీయ మ‌హిళ కాక‌పోవ‌డంతో ఆమెకు తిల‌కం దిద్ద‌డం తెలియ‌లేదు. ఆమె చూపుడు వేలితో కుంకుమ‌ను చేతికో తీసుకోబోగా, స్పందించిన ప‌వ‌న్, ఆ వేలితో కాద‌ని, రైట్ హాండ్ రింగ్ ఫింగ‌ర్ తో ఇలా కుంకుమ దిద్దాల‌ని చూపించారు. వెంట‌నే అన్నా ఆయ‌న‌కు అలానే కుంకుమ దిద్దారు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైర‌ల్ గా మారింది.