ఇదో గొప్ప సినిమా

Nag Ashwin makes Mahanati Movie an extraordinary

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్‌ చిత్రాలు వచ్చాయి. అయితే అవన్ని ఒక్క ఎత్తు అయితే ‘మహానటి’ చిత్రం ఒక ఎత్తు అంటూ నిన్న ఆడియో వేడుకలో పాల్గొన్న అతిథులు అభిప్రాయం వ్యక్తం చేశారు. సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్‌గా సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సావిత్రి జీవితం చివర్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఆమె అభిమానులు మరియు ప్రేక్షకులు ఆమె జీవితం పూర్తిగా తెలుసుకోలేక పోయాం అని భావిస్తున్నారు. వారందరి కోసం ఈ చిత్రంను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించడం జరిగింది. ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే నెల లేదా రెండు నెలలు లేదంటే సంవత్సరం పడుతుంది. కాని సావిత్రి జీవితాన్ని తెలుసుకునేందుకు ఏకంగా మూడు సంవత్సరాల పాటు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రీసెర్చ్‌ చేయడం జరిగింది.

సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుని ఆయన హడావుడి లేకుండా చిత్రీకరించాడు. సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంపిక చేసుకున్నప్పటి నుండి సినిమా విడుదల వరకు అన్ని విషయాల్లో కూడా ఎంతో శ్రద్ద పెట్టి, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా తెరకెక్కించడం జరిగింది. దర్శకుడు పూర్తిగా సావిత్రి సినిమాకు అంకితం అయ్యి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ చిత్రం ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందనే నమ్మకంను నాగార్జున, నాని, ఎన్టీఆర్‌ వంటి స్టార్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు కమర్షియల్‌గా ఆడటం కష్టమే. కాని సావిత్రి చిత్రానికి కమర్షియల్‌ హంగులు కూడా అద్ది చరిత్రను ఎక్కడ వక్రీకరించకుండా నాగ్‌ అశ్విన్‌ ‘మహానటి’ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.