నాగబాబు ఆరో కామెంట్ మరీ హాట్ గురు…!

Naga Babu Ultimate Reply To Balakrishna On 6th Comment

మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటివరకు ఐదు కామెంట్స్ ను విడుదల చేశాడు. తాజాగా అయన బాలకృష్ణ పై ఆరో కామెంట్ వీడియో ని సోషల్ మీడియాలో పెట్టాడు నాగబాబు మాట్లాడుతూ…. బాలకృష్ణ ఒకనోక్క సందర్బంలో మాట్లాడుతూ…. చిరంజీవి… ఎన్టీఆర్ కాలిగోటికి సరిపోడు అంటూ కామెంట్స్ చేశాడు. అప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం చాలా కోపంతో ఉన్నాం.. ఆ టైములో మేము రియాక్ట్ కావలిసింది కానీ మా అన్నగారి మీద మాకు ఉన్న ప్రేమతో ఆ రోజు మేము ఆగాము. అప్పుడు చిరంజీవి గారు బాలకృష్ణ చిన్నపిల్లవాడు, అతని మనస్తత్వం అలాంటిదని ఆంధ్రజ్యోతి పేపర్ లో ఓ కథనం వచ్చింది. ఆ న్యూస్ వలన మేము ఆగిపోవలిసి వచ్చింది. ఎవరి తండ్రి వారికీ గొప్ప… రిక్షా తొక్కే వాడు తన కోడుకి గొప్ప కావచ్చు…. బాలకృష్ణ తన తండ్రి తనకు గొప్ప కావచ్చు అది పక్కవారిని తిట్టి నా తండ్రి అందరికన్నా గొప్పవాడు అనడం ఎంతవరకు సమంజసంటు నాగబాబు ప్రశ్నించాడు.

నాగబాబు కౌంటర్ గా బాలకృష్ణ… చిరంజీవి కాలిగోటికి కూడా సరిపోడు అంటే మీకు ఏలా ఉంటుంది. మీ ఫాన్స్ కు ఏలా ఉంటుంది. మీ ఇంట్లోవారు ఏంత మానసిక బాధను అనుభవిస్తారు. బాలకృష్ణ గారు మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మట్లాడండి. లేకపోతె పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. లూజ్ టంగ్ తో అసలు మాట్లాడవద్దు అన్నారు. మీకు మీ నాన్న గారు అంటే ఏంత ప్రేమో మాకు మా అన్న, మా తమ్ముడన్న అంతే ప్రేమ. మా కుటుంభాల మద్య ఎన్నో బేధా భిప్రాయాలు ఉండవచ్చు. కానీ మేము అన్నదమ్ములం మా మద్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అన్నారు. మా తమ్ముడిని రాజకీయంగా ఎన్నో విమర్శలు చెయ్యండి కళ్యాణ్ బాబు మాటలకు మీరు ప్రతి దాడులు చెయ్యండి అంతే తప్ప పర్సనల్ విషయాల జోలికి, మా ఫ్యామిలీ జోలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేద్దన్నారు. ఇకపై బాలయ్య బాబు జోలికి రానన్నాడు. ఒక వేల మా ఫ్యామిలీ జోలికి వస్తే మరల నేను రావలిసి వస్తుంది. థాంక్స్ బాలయ్య… సినిమా ఇండస్ట్రి ఎవరి ఫ్యామిలీ కి గులాం కాదు అన్నారు. ఇకపై మీరు దీనిపై స్పందిస్తే మీ ఇష్టం… మెగా ఫాన్స్ కూడా ఓ విన్నపం దీనిని పెద్దది చెయ్యకండి. మన జోలికి వస్తే అప్పుడు చూసుకుందాం అన్నారు.