జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పబోతున్న ‘నవ్వుల రారాజు’

జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పబోతున్న 'నవ్వుల రారాజు'

జబర్దస్త్ షో తో మెగా బ్రదర్ నాగబాబు నవ్వుల రారాజు గా మారిపోయారు. తన నవ్వుతోనే జబర్దస్త్ కామెడీ షో చూస్తున్న ప్రేక్షకులను నవ్వించగలడు నాగబాబు. అయితే జబర్దస్త్ షో కి ఎంత పాపులారిటీ ఉందో జబర్దస్త్ షోలో మెగా బ్రదర్ నాగబాబు నవ్వుకి కూడా అంతే పాపులారిటీ ఉంది. అందుకే జబర్దస్త్ షోలో నాగబాబు లేకపోతే ఏదో వెలితి కనిపిస్తుంది. అయితే జబర్దస్త్ షో పాపులర్ అవ్వడానికి నాగబాబు నవ్వు కూడా ఒక కారణం అని చెప్పాలి . అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో నరసాపురం ఎంపీ గా పోటీ చేసిన మెగా బ్రదర్ నాగబాబు విజయం సాధించలేకపోయారు. దీంతో యధావిధిగా మళ్ళీ జబర్దస్త్ జడ్జిగా రీ ఏంట్రీ ఇచ్చారు .

 జబర్దస్త్ షోలో జడ్జ్ గా ఉన్న నాగబాబు షో కి గుడ్ బై చెప్పబోతున్నారట. ప్రస్తుతం ప్రసారమవుతున్న ప్రోగ్రాంలు ముందుగానే షూట్ చేసినట్లు తెలుస్తోంది.  జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి జబర్దస్త్ షో ని డైరెక్ట్ చేస్తున్న నితిన్ భరత్ లను తీసేయడం తో మెగా బ్రదర్ నాగబాబు కాస్త హర్ట్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్త్ షో డైరెక్టర్స్ అయిన నితిన్ భరత్ లతో నాగబాబు కీ మంచి అనుబంధం ఉంది .జబర్దస్త్ యాజమాన్యం వారిద్దరిని తప్పించడంతో నాగబాబుకు ఈ విషయంలో కాస్త ఫీల్ అయినట్లు సమాచారం.