గురువారం నుంచి నాగచైతన్య హిందీ సంభాషణలు పలుకుతున్నారు. అలాగే యుద్ధం కూడా చేస్తున్నారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’ కోసమే ఇదంతా. ఇందులో చైతూ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ లీడ్ రోల్‌లో హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. లాల్‌సింగ్ చద్దా (ఆమిర్ పాత్ర పేరు) ఆర్మీలో ఉన్నప్పుడు అతని స్నేహితుడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారని తెలిసింది.
చైతూది కూడా ఆర్మీ మ్యాన్ పాత్ర అని టాక్. అందుకే ప్రత్యేకంగా ట్రైనర్‌ని పెట్టుకుని, మేకోవర్ అయ్యారని తెలిసింది. గురువారం లడఖ్‌లో ఆరంభమైన ఈ సినిమా సెట్స్‌లోకి ఆమిర్ ఖాన్, నాగచైతన్య తదితరులు ఎంటరయ్యారు. కొన్ని టాకీ సీన్స్‌తో పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఈ సీన్స్‌ని హాలీ వుడ్ స్టంట్ మాస్టర్స్ డిజైన్ చేస్తున్నారట. దాదాపు 20 రోజులు ఈ చిత్రీకరణలో పాల్గొంటారట నాగచైతన్య.