అక్కినేని హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతనికి సినిమాలతో పాటు స్పోర్ట్స్ అంటే విపరీతమైన పిచ్చి. మోటార్ రేసింగ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ టీం ను కొనుగోలు చేశాడు. మోటార్ రేసింగ్ టీమ్ లో భాగం కావాలని చైతు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఇన్ని రోజులకి అతని కళ నెరవేరింది. ఈ ఏడాది జరిగే ఫార్ములా ఫోర్ ఇండియన్ ఛాంపియన్ షిప్ లో చైతు టీం బరిలోకి దిగనున్నది .
నాగచైతన్య టీమ్ కు అఖిల్ రవీంద్ర, నీల్ జానీ డ్రైవర్స్ గా కొనసాగనున్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో తొలి సంవత్సరంలో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ సత్తా ను చాటింది. జట్టులో ఇద్దరు ప్రముఖ డ్రైవర్లు అఖిల్ రవీంద్ర, నీల్ జానీ డ్రైవర్స్ చాంపియన్షిప్ లో ఒకటి, రెండు ఫినిష్స్ ని సాధించారు. నిజానికి నాగచైతన్యకు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ అంటే బాగా ఇష్టం. కొత్తగా స్పోర్ట్స్ కారు కానీ స్పోర్ట్స్ బైక్ కానీ మార్కెట్లోకి వచ్చిందంటే ఫస్ట్ కాల్ చైతుకి వెళుతుంది.
దీంతో గ్యారేజీ లోకి వెళ్లి కొనుగోలు చేస్తాడు. ఇక అక్కినేని అఖిల్ క్రికెట్ లో రాణించిన విషయం తెలిసిందే. మొదట్లో అఖిల్ టీమిండియాలోకి రావాలని అనుకున్నాడు. ఇక ఏమైందో తెలియదు అఖిల్ ట్రాక్ మార్చేశాడు. కాగా… అక్కినేని హీరో నాగచైతన్య ఇటీవలే కాలంలో కస్టడీ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.