ప్రమోషన్స్‌లో అల్లుడు జోరు కనిపించదే…!

Naga Chaitanya New Movie Sailaja Reddy Alludu

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. సెప్టెంబర్‌ 13న వినాయక చవితి శుభాకాంక్షలతో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ఆగస్టు 31న విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా వేయడం జరిగింది. విడుదల వాయిదా నేపథ్యంలో చిత్రంపై రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. సినిమా రీ షూట్‌ అంటూ కూడా కొందరు ప్రచారం చేశారు. సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఒకింత నెగటివ్‌ థాట్‌ ఉంది. ఇలాంటి సమయంలో సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి ఆ థాట్‌ను పాజిటివ్‌గా మార్చాల్సి ఉంది. కాని చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇంకా అలాంటి ప్రయత్నం చేయడం లేదు.

Naga Chaitanya New Movie Sailaja Reddy Alludu

విడుదలకు కనీసం రెండు వారాలు కూడా లేదు. సినిమా గురించి పబ్లిసిటీ కార్యక్రమాలు ఇంకా మొదలు అయినట్లుగా అనిపించడం లేదు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈమద్య కాలంలో సినిమాకు ఎక్కువ పబ్లిసిటీ చేయడం ముఖ్యం. ఎంత పబ్లిసిటీ చేస్తే అంతగా సినిమాకు వసూళ్లు వస్తాయి అనేది ఈమద్య కాలంలో విడుదలైన సినిమాలు నిరూపించాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓపెనింగ్స్‌ రావాలి అంటే కేవలం పబ్లిసిటీతోనే సాధ్యం. కాని శైలజ రెడ్డి అల్లుడు పబ్లిసిటీ విషయంలో జోరు కనిపించడం లేదు. అందుకే ఈ చిత్రంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. నాగచైతన్య చాలా ఆశలు పెట్టుకుని నటించిన ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అని అక్కినేని ఫ్యాన్స్‌ కూడా ఎదురు చూస్తున్నారు.

nag-chaitanya-movies