డబ్బులివ్వకుంటే నెగటివ్‌ రివ్యూలు

varalakshmi talks about movie reviews writers

సోషల్‌ మీడియా, వెబ్‌ మీడియా ఈమద్య చాలా ప్రభావం చూపుతున్నాయి. ఒక సినిమా ఫలితం పాజిటివ్‌గా రావాలన్నా, నెగటివ్‌గా రావాలన్నా కూడా ఈ రెండు మీడియాలపై ఆధారపడి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా తమిళ వెబ్‌మీడియాపై హీరోయిన్‌ వరలక్ష్మి చేసిన విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి. తమిళంలో ఈమె నటించిన తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సత్యరాజ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఆ చిత్రంకు ప్రేక్షకుల నుండి పాజిటివ్‌ టాక్‌ వచ్చినా, రివ్యూవర్స్‌ నుండి నెగటివ్‌ టాక్‌ వచ్చిన కారణంగా సినిమాకు నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని వరలక్ష్మి కాస్త సీరియస్‌గా తీసుకుని, మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

varalakshmi

వరలక్ష్మి మాట్లాడుతూ.. డబ్బులిస్తేనే పాజిటివ్‌ రివ్యూలు రాస్తారనే విషయం నాకు ఈమద్య తెలిసింది. నా సినిమాకు ప్రేక్షకులు మంచి రిపోర్ట్‌ ఇచ్చినా కూడా డబ్బులు ఇవ్వకుంటే నెగటివ్‌ రివ్యూలు రాశారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రివ్యూలు చూసి ప్రేక్షకులు సినిమాను జడ్జ్‌ చేయవద్దని, అసలు సినిమాను చూసేందుక రివ్యూలు చదవద్దంటూ ఆమె కోరింది. సోషల్‌ మీడియా మరియు వెబ్‌ మీడియాలో వచ్చిన టాక్‌ను బట్టి సినిమాను చూడాలనుకునే ఉద్దేశ్యం నుండి ప్రేక్షకులు బయటకు రావాలి అంటూ ఆమె కోరడం జరిగింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కూడా కొందరు రివ్యూల పేరుతో దోచుకుంటున్నారు అంటూ గత కొంత కాలంగా సినీ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా వరలక్ష్మి అదే ఆవేదన వెళ్లడిచేసింది.

varalakshmi