ఓటీటీలోకి నాగ చైతన్య

ఓటీటీలోకి నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య టాలీవుడ్​ గుడ్​ బాయ్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో కింగ్​ నాగార్జునతో కలిసి నటించి హిట్​ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడు చైతూ. బాలీవుడ్​ మిస్టర్ పర్​ఫెక్ట్​ అమీర్ ఖాన్​తో లాల్​ సింగ్​ చద్దా సినిమాలో నాగా చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత.

ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్న‌ాడు. ఈ వెబ్ సిరీస్​ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో చై జర్నలిస్ట్​గా, నెగెటివ్​ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అందులో చైతన్య మేకోవర్​ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్​. మొత్తం మూడు సీజన్​లుగా ఈ వెబ్ సిరీస్​ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఒక్కో సీజన్​లో 8 నుంచి 10 ఎపిసోడ్స్​ ఉంటాయని సమాచారం. అలాగే ఇది టైమ్​ ట్రావెల్​ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్​ సిరీస్​ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఒకవేళ చైతూ టైమ్​ ట్రావెల్​ వంటి కాన్సెప్ట్​ ఉన్న వెబ్​ సిరీస్​లో జర్నలిస్ట్​గా నెగెటివ్​ రోల్ చేస్తే మంచి ఛాలెంజింగ్​ పాత్ర దొరికినట్లే. ఈ పాత్రలో చైతూ ఎలా అలరిస్తాడో వేచి చూడాలి.