సక్సెస్ కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న సుధీర్‌బాబుకు ఎట్టకేలకు ‘సమ్మోహనం’ చిత్రంతో సక్సెస్ దక్కింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక మంచి సబ్జెక్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందు నుండి అనుకుంటున్నట్లుగానే ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కలెక్షన్స్‌ను కూడా రాబట్టడంలో సక్సెస్ అయ్యింది. భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయం అని తేలిపోయింది. సుధీర్‌బాబు కెరీర్‌లో ఒక మంచి చిత్రంగా ఈ చిత్రం నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ మొదట చైతూ వద్దకు వెళ్లిందని, అయితే చైతూకు ఈ చిత్రం కథ అంతగా నచ్చలేదని, గతంలో వచ్చిన రెండు మూడు సినిమాల కథ మాదిరిగా ఉంది అంటూ చెప్పి నో చెప్పినట్లుగా తెలుస్తోంది.
మోహనకృష్ణ ఇంద్రగంటి విభిన్న కథాంశాతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాడు. తాజాగా ఈ చిత్రంతో కూడా కొత్తగా కథను చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక ఈ చిత్రంలో చైతూ చేసి ఉంటే ఫలితం మరింత పాజిటివ్‌గా వచ్చేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నానితో కూడా చర్చలు జరిపిన దర్శకుడు నాని బిజీగా ఉండటం వల్ల సుధీర్‌బాబు వద్దకు వెళ్లినట్లుగా సమాచారం అందుతుంది. సుధీర్‌బాబుకు చాలా కాలం తర్వాత ఒక మంచి సినిమా దక్కిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సార్లు సినిమాలు ఇలాగే అనుకోకుండా చేయాల్సి వస్తుంది, ఆ సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాలో బిజీగా ఉన్నాడు. అందుకే సమ్మోహనంకు డేట్ కుదరలేదు అంటూ అక్కినేని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి చైతూ ఒక మంచి ఛాన్స్‌ను మిస్ అయ్యాడు అంటూ విశ్లేషకులు అంటున్నారు.