ఎట్టకేలకు మామకు డేట్లు ఇచ్చాడు

naga chaitanya gives movie dates to suresh babu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అక్కినేని నాగచైతన్య వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీ బిజీగా కెరీర్‌లో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం ‘సవ్యసాచి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న చైతూ, ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు. ‘శైలజ రెడ్డి అల్లుడు’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఆ సినిమా తర్వాత వెంటనే శివ నిర్వాన దర్శకత్వంలో సమంతతో కలిసి ఒక చిత్రాన్ని చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. నేటి నుండి ఆ సినిమా కార్యక్రమాలు మొదలు అయ్యాయి. ఈ మూడు చిత్రాలు మాత్రమే కాకుండా బాబీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు నాగచైతన్య ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

నాగచైతన్య కెరీర్‌ ప్రారంభించి పుష్కర కాలం పూర్తి అయ్యింది. అయినా ఇప్పటి వరకు మామ సురేష్‌బాబు నిర్మాణంలో సినిమా చేయలేదు. ఆ మద్య రానా నిర్మాణంలో చైతన్య ఒక చిత్రంలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలు నిజం కాలేదు. ఎట్టకేలకు మామ సురేష్‌బాబుకు నాగచైతన్య డేట్లు ఇచ్చాడు. బాబీ దర్శకత్వంలో చైతూ చేయబోతున్న చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. గత సంవత్సరం కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో చైతూ నటించిన ఒక చిత్రాన్ని సురేష్‌బాబు నిర్మించాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల వేరే నిర్మాత ఆ చిత్రాన్ని చేయడం జరిగింది. కాని ఇప్పుడు మాత్రం బాబీ దర్శకత్వంలో మూవీని ఎట్టి పరిస్థితుల్లో సురేష్‌బాబు నిర్మించాలని భావిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.