సూర్య వల్ల నాగబాబుకు లాభమా? నష్టమా?

Nagababu gets profits over Naa Peru Surya Naa Illu India movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలై పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రంకు నాగబాబు ఒక నిర్మాతగా వ్యవహరించిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్‌ ఒక చిత్రం కోసం నాగబాబుకు డేట్లు ఇచ్చిన నేపథ్యంలో ఒంటరిగా సినిమా చేసే ధైర్యం చేయకుండా లగడపాటి శ్రీధర్‌తో కలిసి ఈ సినిమాను నాగబాబు నిర్మించడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు లగడపాటి శ్రీధర్‌ కాస్త ఎక్కువ బడ్జెట్‌నే ఖర్చు చేశాడు. ఈ చిత్రం కోసం నాగబాబు చేసిన ఖర్చు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అయినా కూడా సినిమాలో దాదాపు 25 శాతం వాటాను దక్కించుకున్నాడు.

సినిమా విడుదలకు ముందే మంచి బిజినెస్‌ను సాధించింది. ఏకంగా 80 కోట్లకు అన్ని ఏరియాల్లో అమ్ముడు పోయింది. దాంతో సినిమా వల్ల నిర్మాతలు అయిన లగడపాటి శ్రీధర్‌ మరియు నాగబాబులు లాభాలు దక్కించుకున్నారు. విడుదలకు ముందు ఈ చిత్రంతో నాగబాబు దాదాపు 8 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమా సక్సెస్‌ అయితే మరో 10 నుండి 15 కోట్ల వరకు కలెక్షన్స్‌ వస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టడంలో విఫలం అయ్యింది. దాంతో ఈ చిత్రంతో నాగబాబుకు కేవలం 8 కోట్ల మేరకు లాభం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆరంజ్‌ సినిమా తర్వాత చాలా కాలం నిర్మాణంకు దూరంగా ఉన్న నాగబాబు ఈ చిత్రంతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ముందు ముందు పెద్ద సినిమాలు తీస్తానంటున్న నాగబాబు తన కొడుకుతో సినిమాలకు మాత్రం ఇంకాస్త సమయం కావాలని చెబుతున్నాడు.