ఆకాష్‌ పూరికి ఓ సలహా

audience about akashpuri over mehabooba flap

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తండ్రి స్టార్‌ డైరెక్టర్‌ అవ్వడంతో ఆకాష్‌ పూరి చిన్నప్పటి నుండి సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు.పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన ఆకాష్‌ తాజాగా హీరో అయ్యాడు. నిన్న మొన్నటి వరకు బాల నటుడిగా కనిపించిన కుర్రాడు ఇప్పుడు హీరో అంటే ప్రేక్షకులు కొద్దిగా జీర్ణించుకోవడంకు ఇబ్బంది పడుతున్నారు. ‘మెహబూబా’ సినిమాతో అదే జరిగింది. ఆ చిత్రంలో ఆకాష్‌ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ పాత్ర ఆకాష్‌కు ఏమాత్రం సెట్‌ కాలేదని, చిన్న కుర్రాడిగానే ఇంకా ఆకాష్‌ను చూస్తున్నారు అంటూ సినీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆకాష్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఆకాష్‌ పూరిని బాలనటుడిగా చూపిన వారు ఇప్పుడు ఆయన్ను హీరోగా చూడాలంటే ప్రేక్షకులు అంగీకరించలేక పోతున్నారు. గతంలో బాల నటులుగా నటించిన వారు పలువురు హీరోలుగా మారిన విషయం తెల్సిందే. వారి విషయంలో జరగనిది ఈయన విషయంలో జరుగుతుంది. కారణం మొన్నటి వరకు కూడా ఈయన సినిమాల్లో నటించడమే అంటున్నారు. బాల నటుడిగా నటించిన తర్వాత కనీసం ఒక అయిదు సంవత్సరాలు అయినా గ్యాప్‌ తీసుకుంటేనే ప్రేక్షకులు పర్వాలేదు కుర్రాడు పెద్దొడు అయ్యాడు అనుకుంటారు. అందుకే ఇప్పటికైనా ఆకాష్‌ ఒక అయిదు సంవత్సరాల పాటు ఎలాంటి సినిమాల్లో నటించకుండా కాస్త కండలు పెంచి, బాడీ పెంచి సినిమాలు చేస్తే అప్పుడు హీరోగా గుర్తిస్తారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.