Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని నాగార్జున ఓ నటుడుగా ఎంత షార్ప్ గా వుంటారో ఓ బిజినెస్ మ్యాన్ గా అంతకన్నా షార్ప్. అందుకు తాజా ఉదాహరణ అన్నపూర్ణ బ్యానర్ మీద తాజాగా తీసిన రంగులరాట్నం సినిమా. ఈ సినిమా నెల కిందటే విడుదలకు సిద్ధం అయ్యింది. మంచి టైం కోసం ఎదురు చూస్తూ వున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ముందుగా చెప్పినా అజ్ఞాతవాసి, జై సింహా లాంటి పెద్ద సినిమాలు రేసులో ఉండటంతో సైలెంట్ గా సైడ్ అయిపోయారు. అజ్ఞాతవాసి ప్లాప్ అవ్వడం, జైసింహా కూడా యావరేజ్ టాక్ రావడంతో అక్కినేని నాగార్జున అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి దాన్ని అమలు చేస్తున్నారు. 12 వ తారీఖున మాత్రమే 14 వ తేదీన రంగులరాట్నం విడుదల అని ప్రకటించారు.
ఈ వ్యవహారం చూస్తుంటే నాగార్జున నిర్మాతగా కూడా ఎందుకు సక్సెస్ అయ్యారో తేలిగ్గా చెప్పొచ్చు. సంక్రాంతి సీజన్లో ఏ సినిమాలు అంతగా టాక్ రాని టైం లో ఆ అవకాశాన్ని జారవిడవకుండా అప్పటికప్పుడు సినిమా విడుదలకు ప్లాన్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అంత తేలిక కాదు. పైగా అంత వేగంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం. అయినా నాగ్ ఆ పనిని విజయవంతం చేసి తాను పక్కా బిజినెస్ మ్యాన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. రిలీజ్ కి సడన్ గా వచ్చినట్టే సినిమా కూడా సర్ఫరైజ్ హిట్ అవ్వాలని కోరుకుందాం.