Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత కొన్ని సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మకు సక్సెస్ లేదు. అయినా కూడా ఏమాత్రం నిరాశ పడకుండా తనవంతు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. వర్మ వరుసగా వివాదాస్పద చిత్రాలు చేస్తూ కెరీర్లో ముందుకు సాగుతున్నాడు. తెలుగులో చాలా సంవత్సరాలుగా చిన్న చిత్రాలు, చిన్న హీరోలతో చిత్రాలు చేస్తున్నాడు తప్ప పెద్ద హీరోతో సినిమాను చేసింది లేదు. ఎట్టకేలకు నాగార్జునతో రామ్ గోపాల్ వర్మ సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు. ‘శివ’ తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించబోతున్నాడు.
ఇక ఈ చిత్రం ‘శివ’ చిత్రానికి సీక్వెల్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు వర్మ ఫుల్ స్టాప్ పెట్టాడు. శివ సినిమాకు ఈ సినిమాకు అస్సలు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు. శివ సినిమాను రీమేక్ చేసి దెబ్బ తిన్నాను, సీక్వెల్ చేసేంత సాహసం చేయను అంటూ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి కథ విభిన్నంగా ఉంటుందని, నాగార్జున బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా ఒక మంచి కథను సిద్దం చేసినట్లుగా వర్మ చెబుతున్నాడు.
నాగార్జున పోలీస్ ఆఫీస్‌గా వర్మ సినిమాలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియాలో వస్తున్న ఈ వార్తపై నాగార్జున స్పందిస్తూ తానే చెప్పాలనుకున్నా, కాని అప్పటికే మీడియాకు చేరిపోయింది. అవును వర్మ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో నేను పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. వర్మ ఒక మంచి యాక్షన్ కథను వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈనెల 15న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. వచ్చే సంవత్సరం వేసవి కానుకగా సినిమాను విడుదల చేస్తామని చెబుతున్నారు. వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.