ఈ వారం అంతా నవ్వు, ఏడుపు అయినా ‘హలో’..!

nagarjuna-emotional-tweet-about-last-week-incidents

 Posted November 14, 2017 at 19:10 

అక్కినేని ఫ్యామిలీలో ఈ వారం ఎప్పటికి గుర్తుండి పోతుంది. ఇటీవలే అక్కినేని నాగచైతన్య వివాహ రిసెప్షన్‌ భారీ ఎత్తున జరిగిన విషయం తెల్సిందే. కుటుంబ సభ్యులు అంతా కూడా సంతోషంగా రిసెప్షన్‌ వేడుకలో సందడి చేశారు. అయితే రిసెప్షన్‌ అయ్యి 24 గంటలు కూడా పూర్తి కాకుండానే అక్కినేని వారి ఇంట శోఖంను మిగిల్చిన సంఘటన అన్న పూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం. అక్కినేని నాగేశ్వరరావు గుర్తుగా ఉంచిన ‘మనం’ సెట్టింగ్‌ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్దం అయ్యింది. ఈ విషయాలపై నాగార్జున ట్విట్టర్‌లో స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు, తమ భవిష్యత్తు ప్లాన్స్‌ను చెప్పుకొచ్చాడు.

nagarhjuna

ఈ వారం చాలా ఎమోషనల్‌ వీక్‌, ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. మేము ఈ వారంలో నవ్వాం అలాగే ఏడ్చాం అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. ఇక జరిగిన విషయాన్ని పక్కకు పెట్టి ముందు నుండి అనుకుంటున్నట్లుగా నేటి నుండే హలో సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టబోతున్నాం అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. నిన్న జరిగిన అగ్ని ప్రమాదం హలో ప్రమోషన్‌ కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని నేటి నుండి హలో సందడి ప్రారంభం అంటూ నాగార్జున మరియు అన్నపూర్ట స్టూడియోస్‌ అధికారిక పేజ్‌లో పేర్కొనడం జరిగింది. నాగార్జున స్వయంగా నిర్మించిన ‘హలో’ సినిమాకు విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వం వహించాడు.

emotional-tweet-about-last

SHARE