‘హలో’ సందడి షురూ..!

Akhil Hello Teaser Release Date poster

Posted November 14, 2017 at 18:54 
అక్కినేని ఫ్యామిలీ గత కొన్ని రోజులుగా తెగ వార్తల్లో ఉంటుంది. ఇటీవలే అక్కినేని నాగచైతన్య, సమంతల వివాహ రిసెప్షన్‌ చెన్నైలో మరియు హైదరబాద్‌లో వైభవంగా జరిగింది. ఆ సందడి కొనసాగుతున్న సమయంలోనే అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం కారణంగా నిన్నంతా కూడా అక్కినేని ఫ్యామిలీ గురించి మరోసారి మీడియా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలిచింది. నిన్న అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో హలో ప్రమోషన్‌ కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా నేడు ఉదయం నాగార్జున ట్విట్టర్‌ ద్వారా ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్లుగా చెప్పాడు.

akhil-Hello-movie-first-loo

అన్నట్లుగానే ‘హలో’ టీజర్‌ను నాగార్జున అధికారికంగా అనౌన్స్‌ చేశాడు. ఈనెల 16న అఖిల్‌ ‘హలో’ టీజర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే టీజర్‌ రెండు వర్షన్‌లను కట్‌ చేయడం జరిగింది. రేపటి వరకు ఫైనల్‌ వర్షన్‌ను ఖరారు చేయనున్నారు. పలువురు సినీ ప్రముఖులు మరియు స్నేహితుల అభిప్రాయం తెలుసుకుని ఆ తర్వాత టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా అక్కినేని కుటుంబ సభ్యుల నుండి సమాచారం అందుతుంది. మొత్తానికి హలో టీజర్‌ ప్రకటనతో సినీ వర్గాల్లో సందడి మొదలైంది.

డిసెంబర్‌ 22 వరకు సినిమా సందడి కొనసాగుతుందని, ప్రచారంను భారీ ఎత్తున చేసి సినిమాపై అంచనాలను అమాంతం పెంచాలనేది నాగార్జున ప్లాన్‌గా తెలుస్తోంది. అఖిల్‌ మొదటి సినిమా ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో ఈ చిత్రం అయినా సక్సెస్‌ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో నాగార్జున తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ మొత్తం పెట్టి ఈ చిత్రాన్ని నిర్మించిన నాగార్జున అఖిల్‌కు ఈ సినిమాతో సక్సెస్‌ గ్యారెంటీ అంటూ ధీమాగా ఉన్నాడు.

Akhil Hello Movie teaser poster

SHARE