సహజ నటి ఎట్టకేలకు..!

tollywood senior actress Jayasudha to act in a maniratnam next Film

 Posted November 14, 2017 at 18:53 

సహజ నటి జయసుధ కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె భర్త నితిన్‌ కపూర్‌ చనిపోయినప్పటి నుండి కూడా ముంబయిలోని ఇంటికే పరిమితం అయ్యారు. దాదాపు ఆరు నెల తర్వాత జయసుధ మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు. ఈ రీ ఎంట్రీ మణిరత్నం దర్శకత్వంలో ఉండబోతుంది. తమిళంలో భారీ అంచనాల నడుమ మణిరత్నం దర్శకత్వంలో శింబు హీరోగా నటించబోతున్న సినిమాలో జయసుధ ముఖ్య పాత్రలో ఎంపిక అయ్యింది.

jayasudha

మణిరత్నం సినిమాతో పాటు తెలుగులో కూడా పలు ఆఫర్లు జయసుధ ముందు ఉన్నాయి. ప్రస్తుతానికి మణిరత్నం సినిమా వరకు మాత్రమే ఓకే చెప్పిందని తెలుస్తోంది. తెలుగులో ఒక స్టార్‌ హీరో చేయబోతున్న సినిమాలో కూడా జయసుధ నటించేందుకు కమిట్‌ అయ్యే అవకాశం ఉంది. మెల్ల మెల్లగా మళ్లీ జయసుధ బిజీ అయ్యే అవకాశం ఉంది. వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ దూసుకు పోవాలని జయసుధ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం సినిమా కోసం స్క్రీన్‌ టెస్ట్‌ జరుగుతుంది. త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌లో జయసుధ నటించనున్నారు. వచ్చే సంవత్సరంలో జయసుధ వరుసగా సినిమాలు ఒప్పుకోవాలని భావిస్తున్నారు. భర్త పోయిన బాధ నుండి మెల్లగా తేరుకుంటున్న జయసుధ త్వరలోనే పూర్తిగా మామూలు మనిషి అయ్యి, సినిమాలతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

SHARE