జక్కన్న తర్వాత సినిమా గురించి చిన్న లీక్‌…

DVV Danayya leaks to Rajamouli next movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తర్వాత సినిమా ఎప్పుడెప్పుడా అని తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకు వచ్చాడు. అందుకే రాజమౌళి తర్వాత సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి 2’ చిత్రం విడుదలై నెలలు గడిచి పోతున్నా కూడా ఇంకా జక్కన్న సినిమాను ప్రకటించక పోవడం అందరికి నిరాశను కలిగిస్తుంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కాని తాజాగా ఒక చిన్న లీక్‌ ద్వారా రాజమౌళి సినిమా గురించి ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Rajamouli and vijayendra prasad

రాజమౌళి తర్వాత సినిమాను దానయ్య బ్యానర్‌లో చేయబోతున్న విషయం తెల్సిందే. దానయ్య నుండి అనధికారికంగా సినిమా గురించిన అప్‌డేట్స్‌ లీక్‌ అయ్యాయి. ఇటీవలే దానయ్య సన్నిహితుల వద్ద సినిమా గురించి మాట్లాడుతు ప్రస్తుతం రాజమౌళి మరియు విజయేంద్ర ప్రసాద్‌లు ఇద్దరు కలిసి కథను ఫైనల్‌ చేసే పనిలో ఉన్నారని, త్వరలోనే కథ ఫైనల్‌ అవుతుందని చెప్పుకొచ్చాడు. కథ ఫైనల్‌ అయిన తర్వాత నటీనటుల ఎంపిక చేస్తారని, జనవరిలో సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని దానయ్య అనఫిషియల్‌గా తేల్చి చెప్పాడు. ప్రస్తుతం అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.