Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల కాంబినేషన్‌లో దాదాపు 28 సంవత్సరాల క్రితం వచ్చిన ‘శివ’ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. నాగార్జున మరియు రామ్ గోపాల్ వర్మలు ఓవర్ నైట్‌లో స్టార్స్ అయ్యారు. వీరిద్దరి కెరీర్‌లో శివ ఎంత ముఖ్యమో తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆ కాంబోలో మూవీ తెరకెక్కబోతుంది. తెలుగులో పలు సినిమాలు చేసి బాలీవుడ్ వెళ్లి అక్కడ పలు సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్, అట్టర్ ఫ్లాప్‌ను పొంది, మళ్లీ తెలుగుకు వచ్చి టాలీవుడ్‌లో వరుసగా ఫ్లాప్‌లు తీస్తున్న వర్మ తాజాగా నాగార్జునతో ఒక సినిమాను ప్రకటించాడు.
నాగార్జున, వర్మ సినిమా అనగానే కొందరిలో ఆనందం, ఆసక్తి కలుగగా, మరి కొందరు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకుని నాగార్జున తప్పు చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. దశాబ్ద కాలంగా సక్సెస్ అంటే తెలియని దర్శకుడు వర్మ. ఇప్పుడు ఆయన సక్సెస్ ఇస్తాడని నాగార్జున ఎలా నమ్ముతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. నాగార్జున అంత తెలివి తక్కువ మనిషి ఏం కాదు అనే విషయాన్ని గుర్తించాలి. వర్మతో సినిమా సక్సెస్‌పై ఆయనకు పెద్దగా నమ్మకం లేదు. కాని వర్మతో సన్నిహిత్యం కావాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఈ సినిమాకు ఓకే చెప్పాడు. బాలీవుడ్‌లో వర్మకు మంచి పరిచయాలున్నాయి. ఆ పరిచయాలు ఎప్పటికైనా నాగార్జునకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఇంకా పలు విధాలుగా ఆలోచించిన తర్వాతే నాగార్జున ఈ సినిమాకు కమిట్ అయ్యాడు. సహజంగా అయితే నాగార్జున తనకు నమ్మకం ఉన్న సినిమాలను సొంతంగా నిర్మిస్తాడు. కాని వర్మతో సినిమాను నిర్మించేందుకు ముందుకు రాలేదు. కనీసం భాగస్వామిగా కూడా ఉండేందుకు అంగీకరించలేదు. దాంతో స్వయంగా వర్మ తన ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నాడు. కేవలం పారితోషికం తీసుకుని ఈ చిత్రంలో నాగార్జున నటించబోతున్నాడు. లాభాలు వచ్చినా, నష్టం వచ్చినా తనకేం సంబంధం లేదు అన్నట్లుగా నాగార్జున ఒప్పందం చేయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి మంచి నటుడు మాత్రమే కాదు మంచి వ్యాపార వేత్త అని నాగార్జున మరోసారి నిరూపించుకున్నాడు.