Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగార్జున, వర్మల కాంబినేషన్లో చాలా సంవత్సరాల తర్వాత ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రంను వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన లుక్ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది. ఇక ఈ చిత్రంకు టైటిల్‌గా పు పేర్లను పరిశీలించి చివరకు ఆఫీసర్‌ను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.
టైటిల్‌ను ఆదివారమే అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నా కూడా అతిలోక సుందరి శ్రీదేవి మరణంతో వాయిదా వేయడం జరిగింది. ముందు అనుకున్న ఈ టైటిల్ చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా లీక్ అయ్యింది. వర్మ చాలా కాలంగా శ్రద్ద పెట్టకుండా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఇన్నాళ్లకు నాగార్జునతో అత్యంత శ్రద్ద పెట్టి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాను గతంలో తెరకెక్కించగా సూపర్ హిట్ అయిన చిత్రాల మాదిరిగా ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వర్మ వ్యక్తం చేస్తున్నాడు. నాగార్జున ‘ఆఫీసర్’గా మరో సక్సెస్‌ను దక్కించుకుంటాడనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్ కలిగి ఉన్నారు. నాగార్జున, వర్మల కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ సినీ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. అందుకే 25 కోట్లతో ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో కూడా ఈ చిత్రం భారీగా డిమాండ్ కలిగి ఉంది.