నాగర్జున గారి ‘కుబేర’ ఫస్ట్ లుక్ : చైతూ ఎం అన్నాడంటే …!

Nagarjuna's 'Kubera' First Look: Chaitu M Annadante ...!
Nagarjuna's 'Kubera' First Look: Chaitu M Annadante ...!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కుబేర. ఈ సినిమా ను అనౌన్స్ చేసినప్పటి నుండి మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది . మేకర్స్ ధనుష్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ లో కింగ్ నాగార్జున ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మేకర్స్ తాజాగా నాగార్జున పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.

Nagarjuna's 'Kubera' First Look: Chaitu M Annadante ...!
Nagarjuna’s ‘Kubera’ First Look: Chaitu M Annadante …!

పోస్టర్ ఆడియెన్స్ ని విశేషం గా ఆకట్టుకుంటుంది. నాగార్జున లుక్ పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే హీరో నాగ చైతన్య ఈ లుక్ పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. నాన్న లుక్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది అని అన్నారు. ఈ మూవీ లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది . రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.