Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా బ్రదర్ నాగబాబు మొదట హీరోగా ప్రయత్నించి సక్సెస్‌లు దక్కక పోవడంతో నిర్మాతగా మారాడు. అంజన ప్రొడక్షన్స్‌ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించాడు. అన్నయ్యతో చేసిన దాదాపు అన్ని సినిమాలు కూడా నాగబాబుకు మంచి లాభాలను దక్కించి పెట్టాయి. ఆచితూచి, అడపాదడపా చిత్రాలు నిర్మిస్తు వచ్చిన నాగబాబు ‘ఆరంజ్’ చిత్రాన్ని నిర్మించి మొత్తం కోల్పోయాడు. ఆ చిత్రం కొట్టిన దెబ్బతో పది సంవత్సరాల పాటు నిర్మాణంకు దూరం అయ్యాడు. మళ్లీ ఇప్పుడు సినిమా నిర్మాణంకు సిద్దం అయ్యాడు.
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్‌తో కలిసి నాగబాబు ఒక సినిమాను నిర్మిస్తున్నాడు. బన్నీ డేట్లు నాగబాబు వద్ద ఉన్న నేపథ్యంలో పూర్తిగా సాహసం చేయాలంటే భయం వేసిందో ఏమో కాని నాగబాబు మరో నిర్మాత లగడపాటి శ్రీధర్‌ను కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ చిత్రంతో నాగబాబు మళ్లీ పూర్వ వైభవంను దక్కించుకుంటాడా, వరుసగా మళ్లీ చిత్రాలు నిర్మిస్తాడా అనేది చూడాలి.