వివాదాలంటే ముందుండే వర్మ మరో వివాదానికి కారణమయ్యాడు. ఇటీవలే సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’ వచ్చిన సంగతి తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ మంచి కలెక్షన్లను కొల్లగొడుతోంది. అయితే ఆ సినిమా సంజయ్ దత్ ఇమేజ్ మేకోవర్ కోసం తీశారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్న తరుణంలో వర్మ స్పందించాడు. దత్‌కు అండర్ వరల్డ్‌తో ఉన్న సంబంధాల గురించి సినిమా తీస్తానని ప్రకటించాడు. అయితే తన అన్న సంజయ్ దత్ బయోపిక్ తీస్తానని ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై నమ్రతదత్ మండి పడింది.
సంజూ జీవితంలోని చీకటి అధ్యయాలపై ఫోకస్ చేస్తానని, అండర్ వరల్డ్‌తో దత్‌కు ఉన్న సంబంధాలపై సినిమాను తీస్తానని వర్మ చేసిన వర్మ ప్రకటనను నమ్రత తప్పు పట్టింది. వర్మ ఇలా ప్రకటించడం అర్థం లేని విషయం అని ఆమె వ్యాఖ్యానించింది. ఒకవేళ తన అన్న జీవితంపై వర్మ సినిమా తీయాలని అనుకుంటే, అందుకు ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలని నమ్రత వ్యాఖ్యానించింది. ఒకవేళ సంజయ్ దత్ అందుకు అనుమతిని ఇస్తే వర్మ అప్పుడు సినిమా తీసుకోవచ్చని, అంతే కానీ అర్థం లేని ప్రకటనలు చేయడం ఏమిటని నమ్రత ప్రశ్నించింది. దీని పై వర్మ ఎలా స్పందిస్తాడో మరి.