Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Nandyala By-Elections LikeTriangle Love Story Between Ycp Tdp Congress
సినిమాల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇలాంటి స్టోరీలు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ పెంచుతాయి. ఇప్పుడు నంద్యాలలో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీనే నడుస్తోంది. అందరికీ ఎమ్మెల్యే పదవి కావాలి. అందుకే ఇప్పటిదాకా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, వైసీపీకి.. ఆటలో అరటిపండులా కాంగ్రెస్ తోడైంది. ఈ దెబ్బతో ప్రధాన పార్టీలకు టెన్షన్ పెరిగింది.
కాంగ్రెస్ చీల్చే ఓట్లు ఎవరికి నష్టం చేస్తాయనే లెక్కలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కు కాస్తో కూస్తో ఓటు బ్యాంకు ఉంది. ఈ మధ్య హోదా పోరాటాలతో ఆ పార్టీకి కాస్త సానుభూతి పెరిగిందనే వాదన ఉంది. అదే నిజమైతే వైసీపీకే నష్టమనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీకి పడే ఓట్లన్నీ కాంగ్రెస్ వే కాబట్టి.. ఇప్పుడు కాంగ్రెస్ చీల్చే ఓట్లతో జగన్ కు నష్టం తప్పదు.
ఒకవేళ కాంగ్రెస్ కు అనుకున్నంత ఓట్లు రాకపోయినా కూడా వైసీపీకే నష్టం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత కేంద్రీకృతమైనా.. టీడీపీకి అండగా భూమా బలగం ఉంది కాబట్టి. శిల్పా వైఎస్ ఆశీస్సులతో రాజకీయాల్లో పైకొచ్చారే కానీ.. ఛరిష్మా లేదనేది అందరి మాట. భూమా అన్న కొడుక్కి ప్రస్తుతానికి ఫేమ్ లేకపోయినా ఎమ్మెల్యే అయ్యాక అదే వస్తుందంటున్నారు మంత్రి అఖిలప్రియ.
మరిన్ని వార్తలు