Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యువ హీరో నాని, సాయి పల్లవి జంటగా ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సహజ నటుడిగా పేరు తెచ్చుకున్న నాని, ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన సాయి పల్లవిల కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించాడు.
షూటింగ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో తాజాగా నాని మరియు సాయి పల్లవిల మద్య చిన్న గొడవ జరిగిందని, దాంతో నాని అర్థాంతరంగా షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఒక సీన్లో నాని, సాయి పల్లవిలు కలిసి నడుచుకుంటూ వెళ్లే సమయంలో గొడవ ప్రారంభం అయ్యిందని, అది కాస్త సాయి పల్లవి ఆగ్రహంతో నానిని తిట్టే వరకు వెళ్లిందని, హీరోయిన్‌పై ఆగ్రహంతో నాని షూటింగ్ స్పాట్‌ను వదిలేసి వెళ్లాడని తెలుస్తోంది. ఆ తర్వాత సాయి పల్లవితో నానికి సారీ చెప్పించి మళ్లీ షూటింగ్‌ను పున:ప్రారంభించడం జరిగింది.