నానిని ఎవరో తప్పుదోవ పటిస్తున్నారు

Nani announces his next project

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ హీరో నాని వరుసగా ఏడు చిత్రాలతో సక్సెస్‌లు దక్కించుకుని టాలీవుడ్‌ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ హీరోగా నిలిచాడు. ఈ దశాబ్దంలో వరుసగా ఇన్ని విజయాలు దక్కించుకున్న హీరో లేడు అంటూ అంతా కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి సమయంలో నాని తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన కెరీర్‌ను చెడగొడుతున్నాయి. ఇటీవలే నాని ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రంను నాని ఎందుకు ఒప్పుకున్నాడో ఆయనకే తెలియాలి. డబుల్‌ రోల్‌ అనగానే రెండు పాత్రల్లో నటించవచ్చని భావించి ఒప్పుకున్నాడో లేదా మరేమో కాని నాని ఆ చిత్రానికి కమిట్‌ అయ్యి తన నిర్ణయం తప్పు అని తెలుసుకున్నాడు.

నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్ర దర్శకుడు శ్రీరామ్‌ ఆధిత్యకు సరైన ట్రాక్‌ రికార్డు లేదు. అయినా కూడా నాగార్జునతో కలిసి నటించాలనే తపనతో ఆ చిత్రానికి ఓకే చెప్పి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాని ఒక థ్ల్రిర్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఆ విషయాన్ని స్వయంగా నాని చెప్పుకొచ్చాడు. త్వరలో తన నుండి థ్రిల్లర్‌ సినిమాను చూస్తారు అంటూ చెప్పడంతో మరోసారి నాని అభిమానులు షాక్‌ అవుతున్నారు. నాని ఇమేజ్‌కు మంచి మాస్‌ సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాల్సింది పోయి ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని సినిమాల ఎంపిక విషయంలో ఎవరో మిస్‌ గైడెన్స్‌ ఇస్తున్నారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.