దర్శకుడిని గుడ్డిగా నమ్మేసిన నాని

దర్శకుడిని గుడ్డిగా నమ్మేసిన నాని

నాని సినిమా ఓటిటిలో విడుదలవుతోందనే సంబరం ఒక్క రోజయినా లేకుండా స్ట్రీమింగ్‍ మొదలైన రెండు గంటలకే ఆనందం ఆవిరైపోయింది. వి చిత్రానికి యునానిమస్‍గా బ్యాడ్‍ రిపోర్ట్స్ రావడంతో పాటు ఈ చిత్రంలోని చాలా సన్నివేశాలను కామెడీ చేసుకుంటున్నారు.

ఇంత రొటీన్‍ స్క్రిప్ట్ ని నాని ఎందుకు అంగీకరించాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా తన ఇరవై అయిదవ చిత్రంగా వి సెలక్ట్ చేసుకున్నాడు. చూస్తోంటే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణని నాని గుడ్డిగా నమ్మేసినట్టున్నాడు.

అంతకుముందు తనతో అష్టాచమ్మా, జెంటిల్‍మేన్‍ తీసిన దర్శకుడు మిస్‍ ఫైర్‍ అవుతాడని బహుశా ఊహించి వుండడు. అయితే కనీసం కథ విని బేసిక్‍ డౌట్స్ అయినా రైజ్‍ చేసి వుండాల్సింది. వేగంగా సినిమాలు పూర్తి చేసేయాలని చూస్తోన్న నాని స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా వుందనేది చూసుకోవడం లేదనిపిస్తోంది. ఇంతకుముందు వచ్చిన గ్యాంగ్‍లీడర్‍ కూడా హాఫ్‍ బేక్డ్ స్క్రిప్ట్ తో, నిండా లూప్‍హోల్స్ తో తేలిపోయింది.

ఆ సినిమాలో కాస్త కామెడీ అయినా పండింది కాబట్టి ఈ స్థాయిలో విమర్శలు రాలేదు కానీ ‘వి’ మామూలుగా రిలీజయి ఫ్లాపయి వుంటే మాత్రం నానికి బాగా డ్యామేజ్‍ జరిగేది. దర్శకులను గుడ్డిగా నమ్మేయకుండా, జెర్సీ లాంటి పకడ్బందీ కథలు తీసుకొచ్చిన దర్శకులకే ఛాన్స్ ఇస్తే మంచిది.