Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్’ సీజన్ 2 మరో అయిదు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ షోకు హోస్ట్‌గా నాని వ్యవహరిస్తున్నాడు. తెలుగులో ఈ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేశాడు. అయితే ఎన్టీఆర్ వరుసగా సినిమాలకు కమిట్ అవ్వడం వల్ల బిగ్‌బాస్‌ను చేయలేను అంటూ చేతులు ఎత్తేశాడు. దాంతో స్టార్ మా వారు నానిని హోస్ట్‌గా ఎంపిక చేశారు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తాజాగా అందుకు సంబంధించిన విషయాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ప్రెస్మీట్లో నాని మీడియాతో మాట్లాడుతూ బిగ్‌బాస్ కోసం తాను సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
బిగ్‌బాస్‌ను తాను గతంలో చూడలేదు అని, అయితే అందరు బిగ్‌బాస్ గురించి మాట్లాడుతుంటే ఈమద్య చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నందుకు సంతోషంగా ఉందని, తప్పకుండా బిగ్‌బాస్ తనకు కొత్త అనుభూతిని ఇస్తుందని నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ సమయంలోనే హిందీలో బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్, తెలుగు హోస్ట్ ఎన్టీఆర్లలో ఎవరిని మీరు ఫాలో అవుతారు అంటూ ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. ఆ సమయంలో నాని మాట్లాడుతూ ప్రేక్షకులు నన్ను నన్నుగా చూడాలని కోరుకుంటారు. అందుకే వారి కోసం నేను నేనుగా కనిపించాలనుకుంటున్నాను. ఎన్టీఆర్‌ను ఫాలో అవ్వడం వల్ల ప్రేక్షకులు ఆధరించక పోవచ్చు అని, ఎవరిని ఫాలో అవ్వకుండా కేవలం నా స్టైల్లో నేను బిగ్‌బాస్ షోను నిర్వహిస్తాను అంటూ నాని చెప్పుకొచ్చాడు.