Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగులో బయోపిక్ ల జోరు ఊపందుకున్నట్టుగా కనిపిస్తోంది. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ‘మహానటి’ భారీ విజయాన్ని సాధించగా, ఎన్టీఆర్ .. వైఎస్సార్ .. కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ లు లైన్లో వున్నాయి. కోడి రామ్మూర్తి నాయుడు .. స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లు చేయడానికి రానా కొన్ని రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని వార్తలు వచ్చాయి. అయితే అంతకుముందే రానా కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకుని ఉండటం వలన … ఒకేసారి రెండు బయోపిక్ లు చేయవద్దనే ఉద్దేశంతో తాజాగా ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ నుంచి రానా తప్పుకున్నాడట. ఆయన బయోపిక్ నుంచి రానా తప్పుకోవడంతో, దర్శక నిర్మాతలు నానిని సంప్రదించడం … ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు.
1980ల కాలంలో స్టూవర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు అనే పేరు సంచలనం. అతని మీద రకరకాల కథనాలు వున్నాయి. దొంగ అనీ, గజదొంగ అనీ, కాదు, రాబిన్ హుడ్ టైపు అనీ, అతన్ని ఎన్ కౌంటర్ చేయడానికి అతడి ప్రియురాలిని ఒక పోలీసు అధికారి లోబరుచుకున్నాడని, ఎన్నో బ్యాంకులను కొల్లగొట్టిన టైగర్ నాగేశ్వరరావు .. చివరికి ఒక భారీ ఎంకౌంటర్లో చనిపోయాడు. ఇలా ఎన్నో కథలు, మొత్తంమీద ఓ సినిమా కథకు కావాల్సిన ముడిసరుకు వుంది టైగర్ నాగేశ్వరరావు జీవితంలో. అందుకే ఆ స్క్రిప్ట్ తో ఒక సినిమా రెడీ చేస్తున్నారట. “కిట్టు ఉన్నాడు జాగ్రత్త”, “దొంగాట” ఫేమ్ అయిన వంశీ కృష్ణ డైరక్షన్ లో ఈ సినిమాకు ప్లాన్ చేస్తోంది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. నాగేశ్వర్ రావు టైగర్ నాగేశ్వర్ రావు లాగా ఎలా మారాడు. అసలు ఆయన జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అనే అంశం మీద ఈ సినిమా తెరకెక్కుతుంది. జులై నుంచి ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ స్టార్ట్ కానుంది.