నాని సినిమాకు చేదు అనుభవం

krishnarjuna yuddham movie negative collections

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నాని ద్విపాత్రాభినయం చేసిన ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం నాని ఖాతాలో మరో సక్సెస్‌ను వేయలేక పోయింది. వరుసగా ఏడు విజయాలు దక్కించుకున్న నానికి ఈ చిత్రం బ్రేక్‌ వేసింది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ‘రంగస్థలం’ చిత్రం కారణంగా పెద్దగా కలెక్షన్స్‌ రాలడం లేదు. ఇక ‘రంగస్థలం’ చిత్రంకు తోడుగా మహేష్‌బాబు ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ రెండు చిత్రాల మద్యలో నాని చిత్రం నలిగి పోవడం ఖాయం అని మొదటి నుండి అంటూ వచ్చారు, అన్నట్లుగానే అదే జరుగబోతుంది.

వరుస విజయాల పరంపరకు బ్రేక్‌ పడటంతో నాని ఫ్యాన్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంతటి పోటీలో విడుదల చేయకుండా ఉంటే కలెక్షన్స్‌ మరో రకంగా వచ్చేయని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని ద్విపాత్రాభినయం చేసిన ‘జెండా పై కపిరాజు’ చిత్రానికి కూడా ఇదే తరహాలో మంచి టాక్‌ వచ్చి, కలెక్షన్స్‌ రాలేదు. మళ్లీ ఇప్పుడు కూడా అదే తరహా ఫలితం వచ్చింది. దాంతో నానికి ద్విపాత్రాభినయం అచ్చి రాదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని శ్రీరాం ఆధిత్య దర్శకత్వంలో చేస్తున్నాడు. నాగార్జున ఆ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నాడు. త్వరలోనే ఆ చిత్రంకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేయబోతున్నారు.