Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత సంవత్సరంలో నానికి వరుసగా పలు సక్సెస్‌లు దక్కాయి. వరుసగా ఏడు సక్సెస్‌లు దక్కించుకుని ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్న నాని తాజాగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్‌ను జారీ చేయడం జరిగింది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.
ఈ చిత్రంతో నాని తన సక్సెస్‌ను కొనసాగిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాని గతంలో డబుల్ రోల్ చేసిన జెండాపై కపిరాజు ఫ్లాప్ అయ్యింది. కాని ఆ సినిమాలో నాని పాత్రకు మంచి పేరు దక్కింది. నాని మళ్లీ ఈ చిత్రంలో డబుల్ రోల్లో నటించాడు. రెండు పాత్రల్లో కూడా నాని తన నటనతో ఆకట్టుకున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తప్పకుండా ఈ చిత్రం నాని అభిమానులను మారియు సాధారణ సినీ ప్రేమికులను ఆకట్టుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నానికి ఈ చిత్రంపై నమ్మకం లేదని, ఈ చిత్రం ప్రమోషన్ విషయంలో కూడా నాని పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మేర్లపాక గాంధీ మరోసారి తన దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకుంటాడని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో నాని తన సక్సెస్‌ను కొనసాగిస్తాడా లేదా చాలా కాలం తర్వాత ఫెయిల్ అవుతాడా అనేది చూడాలి.