నాని జోరు మామూలుగా లేదుగా!

nani movie with puri jagannath

యువ హీరోల్లో నాని వరుసగా చిత్రాలు చేస్తూ, మంచి సక్సెస్‌ రేటుతో దూసుకు పోతున్నాడు. ఇటీవలే ఈయన ‘ఎంసీఏ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, నాని కెరీర్‌లో నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు. నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్‌ మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ చిత్రాల తర్వాత నాని మరో మూడు నాలుగు సినిమాలకు కమిట్‌ అయినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ‘జర్సీ’ అనే టైటిల్‌తో నాని హీరోగా ఒక చిత్రం ప్రకటించడం జరిగింది. ఆ చిత్రంతో పాటు నాని ఇంకా పలు చిత్రాలకు కూడా కమిట్‌ అయ్యాడు. తాజాగా పూరితో కూడా ఒక సినిమాకు నాని ఓకే చెప్పాడు అంటూ సమాచారం అందుతుంది.

గత కొన్ని సంవత్సరాలుగా పూరి జగన్నాధ్‌ పెద్దగా సక్సెస్‌లను అందుకోవడంలో విఫలం అవుతున్నాడు. దాంతో ఈయన దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు ఏ ఒక్క హీరో కూడా ఆసక్తిని చూపడం లేదు. ఈ సమయంలోనే అనుకోని అవకాశం .అన్నట్లుగా బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’ చిత్రాన్ని చేశాడు. వచ్చిన అవకాశంను పూరి సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఇక తన కొడుకుతో ‘మెహబూబా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడటం జరిగింది. ఇన్ని వరుస ఫ్లాప్‌లు వస్తున్నా కూడా పూరితో సినిమాను చేసేందుకు నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందరు హీరోలు కూడా పూరితో ఒక్క సినిమా అయినా చేయాలని భావిస్తూ ఉంటారు. హీరోయిజంను చూపించడంలో పూరికి ప్రత్యేకమైన బ్రాండ్‌ ఉంది, దాంతో పాటు, మాస్‌ ఆడియన్స్‌కు దగ్గర అవ్వాలంటే ఖచ్చితంగా పూరితో సినిమా చేస్తేనే అది సాధ్యం అవుతుంది అంటూ సినీ వర్గాల వారి నమ్మకం. అందుకే నాని పూరితో సినిమాకు కమిట్‌ అయ్యాడు. అయితే వీరి కాంబో మూవీ 2020 తర్వాత వచ్చే అవకాశం ఉంది.