Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వరుసగా ఆరు చిత్రాలతో నాని విజయాలను సొంతం చేసుకున్నాడు. తాజాగా ‘నిన్ను కోరి’ చిత్రంతో ఏడవ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక హీరో వరుసగా ఏడు సినిమాలు సక్సెస్ అయ్యాయి అంటే ఆ హీరో స్థాయి ఏ రేంజ్‌కు వెళ్లినట్లో అర్థం చేసుకోవచ్చు. నాని తాజాగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం మొదటి రోజే ఏకంగా 10 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ నెంబర్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం. నాని ఇంత కాలం ఒక చిన్న హీరోగా కొనసాగుతూ వచ్చాడు. ఈ కలెక్షన్స్‌ను చూసిన తర్వాత స్టార్ హీరో నాని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
నాని హీరోగా నివేదా థామస్ హీరోయిన్గా ఆది ముఖ్య పాత్రలో నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కింది. విడుదలకు ముందే నిర్మాతకు 20 కోట్లు వచ్చేశాయి. ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 22 కోట్లు చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇక విడుదల తర్వాత ఆ లాభం మరింతగా ఉంది. మొదటి రోజే 10 కోట్లు వచ్చిన ఈ సినిమా మొదటి వారంలో ఖచ్చితంగా 25 నుండి 30 కోట్ల వరకు రాబట్టడం ఖాయం అని, లాంగ్ రన్లో మరో పది కోట్లు రాబడుతుందనే నమ్మకం ఉంది. అంటే మొత్తంగా 35 నుండి 40 కోట్ల వరకు ‘నిన్ను కోరి’ చిత్రం సాధించవచ్చని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ‘నేను లోకల్’ చిత్రం కూడా 30 కోట్లను దాటింది. ఇలా వరుసగా భారీ వసూళ్లను సాధిస్తున్న నానిని స్టార్ హీరో అని ఎలాంటి అనుమానం లేకుండా అనవచ్చు అంటున్నారు ఆయన అభిమానులు.
మరిన్ని వార్తలు