ట్రోలింగ్‌కు నాని సమాధానం

Nani Reply to Social Media Trolling on Bigg Boss-2

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ప్రారంభం అయినప్పటి నుండి కూడా వివాదాల మీద వివాదాలు మూట కట్టుకుంటున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా కౌశల్‌ అభిమానులు కౌశల్‌ ఆర్మీ పేరుతో బిగ్‌బాస్‌ టీంను హోస్ట్‌ నాని ను చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఆమద్య నాని బిగ్‌బాస్‌ హోస్ట్‌గా అర్హుడు కాదు అంటూ సోషల్‌ మీడియాలో జాతీయ స్థాయిలో ట్రెండ్స్‌ను క్రియేట్‌ చేసిన విషయం తెల్సిందే. తాజాగా మరోసారి నానిపై బిగ్‌బాస్‌ టీంపై సోషల్‌ మీడియాలో తారా స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫేవరేట్‌ఇజంతో నాని ప్రవర్తించి ఎక్కువ ఓట్లు వచ్చిన నూతన్‌ నాయుడును ఎలిమినేట్‌ చేసి, తక్కువ ఓట్లు వచ్చిన అమిత్‌ను ఇంట్లో కొనసాగించాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Nani-Bigg-bOss-2

తెలుగు బిగ్‌బాస్‌ నీతిగా జరగడం లేదు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో నాని స్పందించాడు. మీరు వేసే ఓట్లను బట్టి ఎలిమినేషన్స్‌ జరుగుతున్నాయి తప్ప మరో విధంగా జరగడం లేదు. నన్ను నమ్మండి అంటూ నాని చెప్పుకొచ్చాడు. మీరు బిగ్‌బాస్‌ ఇంట్లో ఒకరిని ఫేవరేట్‌గా పెట్టుకుని షో చూస్తారు. కాని నాకు ఆ అవకాశం లేదు. నేను అందరి పట్ల ఒకే భావన, ఒకే అభిప్రాయంతో షో చూడాల్సి ఉంటుంది. నేను షోకు హోస్ట్‌ను కనుక ఎవరిపై అభిమానంను నేను పెంచుకోను, మీ ఓట్లను బట్టి మేము ఎలిమినేట్‌ చేస్తున్నాము అంటూ నాని చెప్పుకొచ్చాడు. నూతన్‌ నాయుడు ఎలిమినేషన్‌ విషయంలో వ్యక్తం అవుతున్న విమర్శలు పీక్స్‌కు చేరడంతో నాని ఈ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.

nani