యువ దర్శకుడి కథను ఒకే చేసిన నాని..?

Nani said ok for the young director story

నాని నటించిన జెర్సీ సినిమా బాక్సాపీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్న నాని ప్రస్తుతం గ్యాంగ్‌లీడర్ సినిమా చేస్తున్నాడు. దీంతోపాటు దిల్ రాజ్ నిర్మాణంలో మరో ప్రాజెక్టుకు కూడా పచ్చజెండా ఊపాడు నాని. ఇదిలా ఉంటే నాని చేస్తున్న మరో చిత్రం గురించి ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవలే కల్కి చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ ఇటీవలే నానిని కలిసి ఓ కథను వినిపించాడట. సినిమా సినిమాకు వైవిధ్యంతో కూడిన కథలను ఎంచుకునే ప్రశాంత్ వర్మ సరికొత్త స్క్రిప్ట్‌ను వినిపించగా..నాని కూడా కథను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ మొదటి చిత్రం ‘అ’తో నాని నిర్మాతగా కూడా మారాడు. తాజా ప్రాజెక్టు ఓకే అయితే మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపై సందడి చేయనుందన్నమాట.