క‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. రాజ్య‌స‌భ‌లో బిల్లు

President ruling in kashmir

క‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌ను ఆర్నెళ్లు పొడిగించాల‌న్న బిల్లును ఇవాళ రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఆ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. రేప‌టితో క‌శ్మీర్‌లో ఆర్నెళ్ల రాష్ట్ర‌ప‌తి పాల‌న గ‌డువు ముగుస్తుంది. గ‌త వార‌మే ఈ బిల్లుకు లోక్‌స‌భ‌లో ఆమోదం ద‌క్కింది. ఈ బిల్లుతో పాటు క‌శ్మీర్‌లో రిజ‌ర్వేష‌న్ బిల్లును కూడా మంత్రి షా ప్ర‌వేశ‌పెట్టారు. జూన్ 2018 నుంచి క‌శ్మీర్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న ఉన్న విష‌యం తెలిసిందే. మెహ‌బూబా ముఫ్తీకి చెందిన పీడీపీతో బీజేపీ క‌టీఫ్ చెప్పిన త‌ర్వ‌త అక్క‌డ ఈ పరిస్థితి త‌లెత్తింది. క‌శ్మీర్ ప‌రిస్థితిని రాజ్య‌స‌భ అర్థం చేసుకుంటుంద‌ని, బిల్లుకు అనుకూలంగా ఓటేస్తార‌ని ఆశిస్తున్న‌ట్లు షా చెప్పారు.