ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “సరిపోదా శనివారం” (Saripodhaa SaniVaaram) కోసం మన అందరికీ తెలిసిందే. మరి వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ “అంటే సుందరానికి” అనుకున్న రేంజ్ హిట్ కాకపోవడంతో ఈసారి గేర్ మార్చి మాస్ హిట్ కొట్టేందుకు ఈ మూవీ ని స్టార్ట్ చేశారు.
మరి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మంచి మాస్ హై ను ఇస్తున్న మేకర్స్ ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ ను అయితే అందించారు. మరి ఈ శనివారం తమ సమవర్తి సాలిడ్ యాక్షన్ మోడ్ లో ఉన్నట్టుగా ఒక యాక్షన్ అప్డేట్ ను అందించారు. సెట్ నుంచి నాని పిక్ ను షేర్ చేయగా నాని చేతికి రక్తపు మరకలు చూడవచ్చు.
దీనితో ప్రస్తుతం నానిపై మాంచి మాస్ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ మూవీ లో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుండగా వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య కీలక పాత్ర చేస్తున్నాడు అలాగే జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.