National Politics: ఢిల్లీ హై కోర్టులో కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ…!

National Politics: Congress to release manifesto today.. Good news for them..!
National Politics: Congress to release manifesto today.. Good news for them..!

ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. తమ అకౌంట్లను ఆదాయపు పన్నుశాఖ ఫ్రీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కాగా లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఐటీ చర్యలను ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ సవాల్ చేసింది.

2014-15, 2015-16, 2016-17 సంవత్సరాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా ఐటీ అధికారులు తమపై ప్రారంభించిన టాక్స్ రీఅసెస్మెంట్ ప్రొసీడింగ్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఈ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్ కౌరవులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కాంగ్రెస్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.

వాదనల అనంతరం ఈ కేసులో టాక్స్ అథారిటీ ఎలాంటి చట్టబద్దమైన నిబంధనల్ని ఉల్లంఘించలేదని, పార్టీ ఎగ్గొ ఆదాయం రూ. 520 కోట్ల కంటే ఎక్కువగా ఉందని కోర్టు పేర్కొంది. కాంగ్రెస్ రిట్ పిటిషన్లను కొట్టివేస్తున్నామని తెలిపింది. తొలుత ఈ పిటిషన్లపై మార్చి 20న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసి నేడు తీర్పు వెల్లడించింది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో ఉన్న రూ. 105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల ముందు ఇబ్బందులు తప్పడం లేదు.