రాష్ట్ర రాజధాని విషయమై అటు అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ నేతల మధ్యన ఒకరకమైన పోరాటం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.. కాగా అయితే సీఎం జగన్ ప్రకటించినటువంటి రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్మాణాన్ని కేవలం వైసీపీ నాయకులు తప్ప ఎవరు కూడా ఆమోదించడం లేదు. కాగా తూర్పు గోదావరి జిల్లా,రాజా నగరంలో జరిగినటువంటి ఒక వివాహ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నటువంటి నారా లోకేష్, మార్గ మధ్యలో రాజమహేంద్రవరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో నారా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో అధికారంలో ఉన్నామనే గర్వంతో ఎన్ని రకాల కుట్రలు చేసినప్పటికీ కూడా రాజధానిని అమరావతి నుండి తరలించేది లేదని నారా లోకేష్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా తమ నినాదం ఎప్పటికి మారదని, ఎప్పటికి కూడా ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇకపోతే రాష్ట్ర రాజధాని విషయంలో ఎప్పటికి కూడా తమది ఒకటే మాట అని, ఎట్టిపరిస్థితుల్లోనూ తమ మాట మార్చబోమని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇకపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు తమ తప్పులను కప్పి పుచ్చుకోడానికే ఇలా అనవసరమైన రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని నారా లోకేష్ ఆరోపించారు. ఇకపోతే త్వరలో రాష్ట్రంలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకుంటామని, ప్రజల బలం కూడా తమకు ఉందని నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.