తీవ్రమైన విమర్శలు చేస్తున్న నారా లోకేష్

తీవ్రమైన విమర్శలు చేస్తున్న నారా లోకేష్

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చాలా మూర్ఖంగా వ్యవహరిస్తుందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. కాగా నారా లోకేష్ సోమవారం నాడు ఇటీవల ఎఎన్‌యు లో జరిగినటువంటి ఘటనలో తీవ్రంగా గాయపడి, విజయవాడ హెల్ప్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు శ్రీకర్‌, రవిచందర్‌లను పరామర్శించారు. ఆతరువాత అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్ర రాజదానిని అమరావతి నుండి తరలించొద్దని 151 గంటలు నిరాహార దీక్ష చేస్తుంటే వారిపై ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా సీఎం జగన్ తీసుకున్న రాక్షసపూరితమైన నిర్ణయం వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించిన ఆయన, ఇది ప్రభుత్వం కుట్ర పూరితంగా చేస్తున్న కుట్రలు అని ఆరోపించారు. దానికితోడు ఆందోళన చేస్తున్న రైతులపై అక్రమ కేసులు పెడుతూ, మహిళలను ఇలా కించపరచడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్…