పోరాటమంటే మాదన్న జగన్… అదిరే పంచ్ వేసిన లోకేష్ !

Nara Lokesh counter on Ys Jagan Tweet

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా సూటి ప్రశ్న సంధించారు. జగన్ ట్వీట్ చేసిన గంటకు సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగానే స్పందించారు. ముందుగా జ‌గ‌న్ విష‌యానికొస్తే ‘చంద్రబాబు గారూ… మీ న‌ల‌భ‌య్యేళ్ల రాజకీయ జీవితంలో ఒక పోరాటంగానీ, ఒక ఉద్య‌మంగానీ ఎప్పుడైనా చేశారా’ అంటూ జ‌గ‌న్ సూటిగా ప్ర‌శ్నించారు. అంటే, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం ఎవ్వ‌రూ పోరాడ‌టం లేద‌నీ, తాము మాత్ర‌మే పోరాడుతున్నామ‌ని చెప్పుకోవ‌డమే ఈ ట్వీట్ ఆంత‌ర్యం.

అయితే ఈ ట్వీట్ కి చంద్రబాబు తనయుడు, ఏపీ మంత్రి లోకేష్ కూడా అదే విధంగా స్పందించారు. ” చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల ఇండస్ట్రీలో ప్రజల కోసం చాలా ఉద్యమాలు చేశారని. కానీ అదేమీ ఆ ఉద్యమాలు, నిరసనలు మీ నాన్న అవినీతి… మీ క్విడ్ ప్రో కో, హత్యలు, కిడ్నాప్, భూ దోపిడికి వ్యతిరేకంగానే చేశారు. జైలు, హత్యలు ఇవన్నీ నువ్వు గుర్తించుకో..!” అని లోకేష్ ట్వీట్ చేశారు. అయితే జగన్ చేసిన ట్వీట్ కి అనేక మంది కామెడీగా కామెంట్ చేస్తున్నారు, ‘పోరాట‌మంటే శుక్ర‌వారం కోర్టులో చేసేది… అదేగా, అయితే అది ఆయ‌న చెయ్య‌లేదు’ అంటూ కొన్ని కామెంట్లు సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు ఎన్ని పోరాటాలు చేసారో అందరూ చూసారు కూడా. బాబ్లీ ప్రాజెక్ట్ పై పోరాడుతూ, మహరాష్ట్ర పోలీసుల చేత దెబ్బలు కూడా తిన్నారు. విభజన సమయంలో, 60 ఏళ్ళ వయసులో 7 రోజులు నిరాహార దీక్ష చేసారు. ఇలా చెప్ప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ఇంత‌కీ జ‌గ‌న్ దృష్టిలో పోరాటం అంటే ఏంటి ? అసలు జగన్ ఏమేమి పోరాటాలు చేసారు అంటే ఏమని చెప్తారు ? ఎంపీగా, నాలుగేళ్ళు ఎమ్మల్యేగా, ప్రతిపక్ష నాయకుడుగా, జగన్ ఇప్పటి వరకు చేసిన ఒక్క పని అయినా ఉందా ? నాలుగున్న‌రేళ్లుగా ప్ర‌త్యేక హోదాపై పోరాటం చేసి అలిసిపోయామ‌ని చెప్పుకుంటారు, కానీ ఎక్క‌డుందా పోరాటం ? కొన్ని దీక్ష‌లు, కొంత హ‌డావుడి మిన‌హా… కేంద్రాన్ని ఇసుమంతైనా ప్ర‌భావితం చేయ‌గ‌లిగిందా పోరాటం..? ప్ర‌జాస్వామ్యంలో పోరాటాలంటే… ఫ‌లితాల‌ను రాబ‌ట్ట‌గ‌లిగేవి మాత్ర‌మే. ఐదుగురు ఎంపీల‌తో రాజీనామాలు చేయించి, అదే త్యాగ‌మ‌న్నారు. ఆ త‌రువాత ధ‌ర్నా అంటూ ఢిల్లీలో కొన్నాళ్లు కూర్చున్నారు. కానీ, కేంద్రం స్పందించిందా, ప్ర‌ధాని మాట్లాడారా..? పార్లమెంటులో చర్చ జరిగిందా..? వారు చేసిన కొన్ని ధర్నాలు, నిరసన కార్యక్రమాలనే పోరాటాలుగా చెప్పుకుంటే ఎలా ? అనే ప్రశ్న వినిపిస్తోంది.