స్టార్ట్ అప్ కంపెనీల పై లోకేష్…

Nara Lokesh meeting with AP Innovation Society officers and IT department

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సచివాలయంలో ఎపి ఇన్నోవేషన్ సొసైటీ ప్రతినిధులు, ఐటి శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం…

ఎపి ఇన్నోవేషన్ సొసైటీ, నాస్కామ్ భాగస్వామ్యంతో  వైజాగ్, కాకినాడ లో నిర్వహిస్తున్న టెక్నాలజీ ఇంక్యూబేటర్స్ లో ఇప్పటి వరకూ నాలుగు కోహార్ట్స్ నిర్వహించాం అని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎపి ఇన్నోవేషన్ సొసైటీ.

ఈ రెండు సెంటర్లలో 16 కంపెనీలు స్టార్ట్ అప్ కంపెనీలను ఇంక్యూబేట్ చేసాం . 4 స్టార్ అప్ కంపెనీలు పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాయి అని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎపి ఇన్నోవేషన్ సొసైటీ.

తిరుపతిలోని XLR8 యాసిలిరేటర్ లో మూడు కోహర్ట్స్ నిర్వహించాం, ఇప్పటి వరకూ 54 కంపెనీలు స్టార్ట్ అప్ కంపెనీలను ఇంక్యూబేట్ చేసాం అని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎపి ఇన్నోవేషన్ సొసైటీ.

8 స్టార్ట్ అప్ కంపెనీలు పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాయి అని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎపి ఇన్నోవేషన్ సొసైటీ.

డ్రోన్ ఇంక్యూబేషన్ సెంటర్ కు ఆఫీస్ స్పేస్ ఇచ్చాం,కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి 2018 జనవరి 15 కు మొదటి
డ్రోన్ తయారు అవుతుంది అని మంత్రి దృష్టి కి తీసుకెళ్లిన ఎపి ఇన్నోవేషన్ సొసైటీ.

ఇతర రాష్ట్రాల్లో ఇంక్యూబేటర్స్ లో కార్యకలాపాలు జరపాలి అంటే చైర్ కి మూడు వేల నుండి ఐదు వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు అని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎపి ఇన్నోవేషన్ సొసైటీ.

ఎపి ఇన్నోవేషన్ సొసైటీ నిర్వహిస్తున్న ఇంక్యూబేటర్స్ లో డబ్బులు వసూలు చేసే పద్ధతి ఉండకూడదు.యువత తమ కాళ్ల పై నిలబడే వరకూ ప్రోత్సాహం ఇచ్చేలా విధానం రూపొందించాలి

కాలక్షేపానికి వచ్చే వారికి ఎపి ఇన్నోవేషన్ సొసైటీ వేదిక కాకూడదు. నిబద్ధతతో ఎదగాలి అనుకునే వారిని స్క్రీన్ చేసిన తరువాత మాత్రమే ఇంక్యూబేటర్స్ లో అవకాశం ఇవ్వాలి.

ఎపి ఇన్నోవేషన్ సొసైటీ ఇంక్యూబేటర్స్ ద్వారా కనీసం ఒక్క బిలియన్ డాలర్ కంపెనీ తయారు కావాలి అనేది
టార్గెట్ గా పెట్టుకొని పనిచెయ్యాలి.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న బూట్ క్యాంప్స్ ను విస్తృతంగా అన్ని కాలేజీల్లో నిర్వహించాలి.

80 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొదటి దశగా టింకరింగ్ ల్యాబ్స్ ప్రారంభించాలి.

12 నెలల్లో 12 హ్యాకథాన్స్ నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించాలి.

స్మార్ట్ సిటీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు వేగవంతం చెయ్యాలి.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏర్పాటు కు కేంద్రం ఆమోదం తెలిపింది నిధుల విడుదల కోసం కేంద్రం తో సంప్రదింపులు జరిపి త్వరగా సెంటర్ ఏర్పాటు పూర్తి చెయ్యాలి.

స్టార్ట్ అప్ ఇండియా రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానానికి ఎదిగేలా కార్యాచరణ రూపొందించాలి.

నవంబర్ నెలాఖరుకి ఏపీ లో అగ్రి ఇంక్యూబేటర్ ఏర్పాటు చెయ్యాలి.