తన నోటి మాటలతో చాలా సార్లు ఇబ్బంది పడ్డ నారా లోకేష్ తాజాగా జగన్ మీద విరుచుకు పడ్డారు. కానీ, ఈ సారి నాలుక మడతపడలేదు. అలాగే, చేసిన వ్యాఖ్యలు కూడా ఏ విషయమో మీదో కాదు ఇటీవల జగన్ పవన్ మీద చేసిన వ్యాఖ్యల గురించి. దీని గురించి మాట్లాడుతూ “ఇది చాలా ఘోరం, క్షమింప రానిది. ఒకరి వ్యక్తిగత విషయాలపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా జగన్ మాట్లాడతాడు. అసలు జగన్ పవన్ కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.” అని అన్నారు. అయితే, పవన్ కి సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నానా… అని ఫీల్ అయ్యాడో ఏమో వెంటనే పవన్ మీద కూడా “పవన్ కళ్యాణ్ నా మీద చేసిన ఆరోపణలను నిరుపించుకోలేకపోయారు” అని వ్యాఖ్యలు చేశారు.
అంతటితో ఆగకుండా పవన్ ని, జగన్ ని ఉద్దేశించి “జగన్, పవన్ ఇద్దరూ కూడా నేను మంత్రి అయ్యిన నుండి నన్ను టార్గెట్ చేశారు. అయితే, ఇప్పటి వరకు నా మీద చేసిన ఒక్క ఆరోపణని కూడా నిరుపించలేకపోయారు. ఒకవేళ నేను అవినీతి పనులు చేస్తున్నానని ఎవరయినా నిరూపిస్తే నేను ఎటువంటి ట్రయిల్ కి అయిన రెడీ. అందరు ముఖ్యమంత్రుల కొడుకులూ జగన్ లా ఉండరు.” అని అన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ తిరిగి మామూలు స్థితికి రావాలంటే చంద్రబాబు నాయుడు గారూ మరో ఇరవయ్యేళ్ళు పరిపాలనలో ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు తన నోరు జారుల్లతో నవ్వులు పాలయ్యే నారా లోకేష్ ఈ సారి మాత్రం ఆ తప్పు చేయకుండా సేఫ్ అయ్యాడు.