రాజధాని గురించి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

రాజధాని గురించి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

నారా లోకేష్ రాజధాని గురించి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. మైక్ హుదేమా చేసిన పోస్ట్ కి గాను నారా లోకేష్ స్పందించారు. అమరావతి నిర్మాణం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వలన ఆగిపోయిందని అన్నారు. అయితే ఈ అమరావతి నిర్మాణం తిరిగి 2024 లో పునర్నిర్మితమవుతుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ఫై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న నారా లోకేష్, ఈ సారి మాత్రం చాల ఘాటుగా స్పందించారు.

అయితే ఇప్పటివరకు అమరావతిలో గ్రాఫిక్స్ చూపించారని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ రోజులు ఇపుడు పోయాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది పని చేసేవాడే అని తెలుపుతున్నారు. అయితే కొందరు మాత్రం జగన్ మూడు రాజధానుల నిర్ణయం విషయం లో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని చూడలేదని అంటున్నారు. పాలన అంతా రివెర్స్ లో ఉందంటూ కామెంట్లు చేసారు. జగన్ పాలన ఫై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం చర్చంశనీయం గా మారింది.