ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నప్పటినుండి ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాగా రాష్ట్రంలోని జగన్ పాలన ఎంత చక్కగా ఉందొ పక్క రాష్ట్రాల మంత్రులు కూడా చాలా బాగా చెప్పుకుంటున్నారో చూడండి అంటూ వాఖ్యానిస్తూ నారా లోకేష్ ఒక ట్వీట్ చేస్తూ… ఆ ట్వీట్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఇటీవలే ఏపీ రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కూడా పెట్టారు నారా లోకేష్.
కాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రస్తుతానికి అమరావతిలో నెలకొన్నటువంటి క్లిష్టమైన పరిస్థితుల కారణంగా తెలంగాణకి ఒకింత మేలు జరుగుతుందని మంత్రి హరీష్ రావు వాఖ్యానించారు. ఇకపోతే అమరావతిలో ప్రస్తుతానికి సిరాస్థి వ్యాపారం పూర్తిగా మందగించిందని, అందువల్ల మరొకసారి హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇకపోతే ఏపీ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు అందరు కూడా హైదరాబాద్ లో ఉండటానికే ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు.