Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- సచివాలయంలో ఐ.టి శాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం
- ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు పై చర్చ
- ప్రపంచ వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి సెకనుకు 12 మంది సైబర్ క్రైమ్స్ వలన ఎఫెక్ట్ అవుతున్నారు
- ర్యాన్సమ్ వేర్ ద్వారా సైబర్ ఎటాక్స్ తో ప్రభుత్వాల దగ్గర ఉన్న సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతున్నాయి
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాడకంలో ఏపి ప్రభుత్వం అందరికంటే ముందు ఉంది దీని వలన సైబర్ ఎటాక్స్ జరిగే ప్రమాదం కూడా పెద్ద ఎత్తున ఉంది
- ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల నుండి ప్రభుత్వ సమాచారాన్ని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అత్యుత్తమ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు
- సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ, డేటా సెక్యూరిటీ ప్రధాన లక్ష్యాలుగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్
- సైబర్ సెక్యూరిటీ కోసం ఇతర దేశాల్లో రూపోయిందించిన విధివిధానాలు,మన రాష్ట్ర పరిస్థితులు అంచనా వేసి వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించిన మంత్రి నారా లోకేష్
- బ్లూ వేల్స్ లాంటి ప్రమాదకర గేమ్స్ మరి కొన్ని వచ్చే ప్రమాదం కూడా ఉంది ఇలాంటి సైబర్ ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి నివారించే స్థాయి సెంటర్ ఏర్పాటు చెయ్యాలి
- సైబర్ క్రైమ్స్ నియంత్రణ కోసం పోలీస్ శాఖ సలహాలు తీసుకొని సైబర్ సెక్యూరిటీ విధి విధానాలను రూపొందించాలి