Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సార్వత్రిక ఎన్నికలు నిర్దేశిత సమయం 2019 లోనే జరుగుతాయా …లేక ఈ ఏడాది 2018 చివరిలో జరుగుతాయా ? .అధికార బీజేపీ మనసులో ఏముంది ? ఈ ప్రశ్నలకు చూచాయగా సమాధానం దొరికింది. మరో నాలుగైదు నెలల్లో కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి సార్వత్రిక ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి అన్నది నిర్ణయిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికార పీఠాన్ని చేపడితే సార్వత్రిక ఎన్నికలను ఓ 6 నెలలు ముందుగా జరపాలని బీజేపీ అనుకుంటోంది. ఆ ఎన్నికలతో పాటు 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుపుతారు. ఆ 8 రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బీజేపీ మనసులో మాటను చెప్పకనే చెప్పారు. అన్ని పార్టీలు కాకపోయినా మెజారిటీ పార్టీలు ఒప్పుకుని రాజ్యాంగ సవరణకు వీలైనంత వెసులుబాటు దొరికితే జమిలి ఎన్నికల నిర్వహణకు కూడా ముందుకు రావాలని బీజేపీ ఆలోచన. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పార్టీ తరపున కొన్ని సంప్రదింపులు మొదలు అయ్యాయి. అయితే మోడీ , అమిత్ షా వ్యవహారశైలి గమనించిన మెజారిటీ పార్టీలు దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానంతో జమిలి ఎన్నికల ఆలోచన మీద సందేహపడుతున్నాయి. కానీ కర్ణాటకలో బీజేపీ గెలిస్తే మాత్రం జమిలి ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడానికి బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తుంది. అందులో సక్సెస్ కాకపోయినా కనీసం ముందస్తు ఎన్నికలు అయితే జరిపి తీరుతుంది.