పక్క చూపులు, కన్ను గీట్లు ఆ పార్టీకి అలవాటే.

narendra-modi-flop-political-strategies-for-2019-elections

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాజకీయాల్లో ఇప్పుడు విలువలు గురించి మాట్లాడుకోవడం అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లాంటిదే. కానీ బీజేపీ మిత్రపక్షాల వ్యవహారంలో చేస్తున్న రాజకీయం చూస్తుంటే మరీ దారుణంగా వుంది. మిత్రపక్షాల్ని, ప్రత్యర్థుల్ని ఒక్క గాటన కట్టేసి వినోదం చూస్తున్న ఆ పార్టీ గురించి ఓ పెద్దాయన చక్కటి కాపురాన్ని లెక్క చేయకుండా పక్క చూపులు, కన్నుగీట్లకి అలవాటు పడ్డ పోకిరి భర్త తో పోల్చాడు. ఆ మాటలు కాస్త ఘాటుగా అనిపించినా 2014 లో బీజేపీ కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాక వివిధ రాష్ట్రాల్లో తన మిత్రపక్షాలతో వ్యవరించిన తీరు చూస్తే ఆ మాటల్లో నిజం అర్ధం అవుతుంది.

narendra-modi

2014 లో ఎవరూ ఊహించని విధంగా సొంత బలంతో కేంద్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి బీజేపీ వైఖరి పక్కింటి పుల్లకూరకి ఆశపడ్డట్టే వుంది. మహారాష్ట్రలో తమతో కలిసి నడిచిన శివసేనకు చెక్ పెట్టడానికి అన్నట్టు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ తో బీజేపీ కన్నుగీట్ల వ్యవహారం నడిపింది. దీంతో బీజేపీ, శివసేన మధ్య దెబ్బ తిన్న సంబంధాలు ఇప్పటికీ మెరుగుపడలేదు. శివసేన బాహాటంగానే బీజేపీ కి రాజకీయ శత్రువులా వ్యవహరించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లోను అంతే.

bjp-party

టీడీపీ తో ఎన్నికల పొత్తు పెట్టుకుని ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో ఉమ్మడి గా ప్రభుత్వాల్ని నడుపుతూ కూడా ఏ రోజు మిత్రధర్మాన్ని పాటించలేదు. ఎన్నికలు అయిన వెంటనే బీజేపీ తో రైతు రుణమాఫీ దగ్గర మొదలైన ఇబ్బందులు, ప్రత్యేక హోదా ని పక్కన పెట్టడంతో పీక్ స్టేజి కి వెళ్లాయి. అంతటితో ఆగకుండా వైసీపీ అధినేత జగన్ కి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇచ్చి రాజకీయంగా ఎంత గందరగోళం సృష్టించాలో అంత సృష్టించారు. ఇక ఇప్పుడు తమిళనాడులోనూ అదే తీరు. నిన్నమొన్నటిదాకా అన్నాడీఎంకే తో అంటకాగి ఇప్పుడు ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిందని భావించి ఏకంగా డీఎంకే అధినేత కరుణానిధి ఇంటికి వెళ్లి కూర్చున్నారు మోడీ. దీనివల్ల బీజేపీ మిత్రపక్షాలకు జరిగే నష్టం, కష్టం మాట ఎలా వున్నా భవిష్యత్ లో ఆ పార్టీ తో జట్టు కట్టేందుకు సైద్ధాంతిక సారూప్యం కలిగిన పార్టీలు సైతం వెనుకడుగు వేయడం ఖాయం. ఇక బీజేపీ అనుకున్నట్టు దేశంలోని అన్ని రాజకీయ పక్షాల్ని నిర్వీర్యం చేసి సొంత బలంతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు అన్నది కలగానే మిగిలిపోతుంది.

modi-politics

నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్ యువనేతని ఓ పప్పుసుద్దగా ప్రొజెక్ట్ చేయడంలో భలే సక్సెస్ అయిన ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం ఇప్పుడు ఇంకో క్రెడిట్ కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. రాహుల్ కి నాయకత్వ లక్షణాలు లేవని ప్రూవ్ చేసిన ఈ నేతలే ఇప్పుడు రాజకీయంగా, పాలనాపరంగా చేసిన తప్పులు ఆయన్ని అధికారానికి దగ్గర చేస్తున్నాయి. పక్క చూపులు, కన్నుగీటలు కాపురాల్లో చివరకి ఇలాంటి ఫలితాలే వస్తాయి.