Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లేడికి లేచినిదే పరుగు అన్నట్టు ప్రొద్దున లేవడం మొదలు రాత్రి పడుకునే ముందు వరకు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు రాజకీయనాయకులు. అంతా లోక కల్యాణం కోసమే అన్నట్టు ఆ విమర్శలు వ్యక్తిగతంగా కాదు రాజకీయ ప్రయోజనం కోసమే ఉంటాయి దాదాపు. వివరాలలోకి వెళితే నేడు ఏపీ సీఎం చంద్రబాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
ఈరోజుకి ఆయన 67 సంవత్సరాలు పూర్తిచేసుకొని 68 వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సహా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మిగతా హామీలను విస్మరించడంతో ఎన్డీయే నుండి తెలుగుదేశం బయటకి వచ్చింది. అప్పటి నుండి తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూనే ఉంది. అప్పటి నుండి చంద్రబాబు మోడీని విమర్శిస్తూనే ఉన్నారు.
అయితే ప్రత్యేక హోదా మీద కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ‘ధర్మ పోరాట దీక్ష’ చేపట్టారు. తెలుగుదేశం-బీజేపీ ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితుల్లో చంద్రబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయురారోగ్యాలతో ఆయన చిరకాలం చల్లగా ఉండాలంటూ ప్రధాని ఆకాంక్షించారు.
Birthday wishes to Andhra Pradesh CM N Chandrababu Naidu Garu. I pray for his long and healthy life. @ncbn
— Narendra Modi (@narendramodi) April 20, 2018
మోదీ ట్విటర్లో స్పందిస్తూ… ‘‘ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడ్ని వేడుకుంటున్నా…’’ అని పేర్కొన్నారు. మరో విషయమేమిటంటే జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు ట్విట్టర్లో శుభకాంక్షలు తెలిపి ఏ విధంగా సర్ప్రైజ్ ఇచ్చాడో, జగన్ కూడా బాబుకు ఇప్పుడు అదే రీతిలో సర్ప్రైజ్ ఇచ్చాడు.
Warm birthday greetings to @ncbn garu. May God bless you with a long and healthy life.
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2018
“చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ జగన్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ గారు మరియు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం అంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్లో తెలిపారు.